ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. అమెజాన్ మ్యూజిక్ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా మరియు యూరప్‌కు చెందిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. కస్టమర్ల ప్రాధాన్యతలు, వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు అమెజాన్ 27,000 మంది ఉద్యోగులను తొలగించింది.