విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడప ఉక్కు ఏర్పాటు కోసం బుధవారం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. విద్యార్థుల నుండి బంద్కు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు చాలా వరకూ ప్రైవేటు యాజమాన్యాలు ముందురోజే సెలువు ప్రకటించాయి. కాగా అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలను సంఘాల నాయకులు బంద్ చేశారు.