సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో రెండోరోజైన బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. గఫూర్ మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి ధ్యేయంగా సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్ర చేపట్టిందని చెప్పారు.