బుధవారం కనిగిరి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్రకు జనం పోటెత్తారు. అటు ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న జనం, సభాస్థలికి చేరుకోగానే జనసంద్రాన్ని తలపించారు. జై జగన్ నినాదాలతో సభాస్థలి హోరెత్తింది. అత్యంత ఉత్సాహంగా జనం...సభ ఆసాంతం కదలకుండా నిలుచున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్దిల గురించి వైసీపీ నేతలు ప్రజలకి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa