సామాజిక సాధికార బస్సుయాత్ర ఆసాంతం జై జగన్ నినాదాలతో పాలకొల్లు మారుమోగిపోయింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బుధవారం సామాజిక సాధికార బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు,ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో సీఎం వైయస్ జగన్ ఆత్మగౌరవం నింపారని నేతలు చెప్పారు. ఐదుగురు ఎస్సీలను మంత్రుల్ని చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa