పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 19 రోజుల్లో 15 సెషన్లలో సమావేశాలు జరుగుతాయన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వివాదానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ నివేదిక, ఐపీసీ స్థానంలో తెచ్చిన మూడు బిల్లులపై స్టాండింగ్ కమిటీ నివేదికలు, ఇతర బిల్లులు, అంశాలను లోక్సభలో ప్రవేశపెడతామన్నారు.