ప్రభుత్వం తక్షణం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ డిమాండ్ చేశారు. తుని నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల దివ్య ఆధ్వర్యంలో తుని పట్నంలోని టిడిపి పార్టీ కార్యాలయం నుంచి ఎస్ ఏ రోడ్ మెయిన్ రోడ్డు మీదగా గొల్ల అప్పారావు సెంటర్ వరకు టిడిపి, జనసేన నాయకులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.