దీపావళి వేడుకలు జరుపుకోవడానికి యావత్ భారత్ సిద్ధమవుతోంది. కానీ పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం 50 ఏళ్లుగా పండుగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1976లో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామగ్రి డిపోను ఏర్పాటు చేశారు. దాంతో పూస్ మండి, భగు, గులాబ్‌గఢ్ గ్రామాల్లో బాణాసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఈ మూడు గ్రామాలు దీపావళి వేడుకకు దూరమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa