రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సలాంబర్ జిల్లాలోని లసాదియా ప్రాంతంలోని బోడ్ఫల్లాలో నివాసముంటున్న ఉంకర్ మీనా కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యుత్ వైర్లు ఇంటి ఇనుప గేటుకు తాకాయి. దాంతో ఉంకర్ మీనా, భన్వారీ, దేవిలాల్తో పాటు అతడి కుమార్తె విద్యుదాఘాతానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.