స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఫైబర్ నెట్ కేసులో ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తుపై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.