ఇజ్రాయిల్ పై ఆకస్మికంగా దాడి చేసి గాజాలో బందీలుగా చేసిన పౌరులను వెంటనే విడిచిపెట్టాలని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ స్పష్టం చేశారు. 'ఇజ్రాయెల్ పై జరిగిన ఘోర దాడిని మేం ఇప్పటికే ఖండించాం. ఉగ్రవాదంపై ఉదాసీనత తగదు. బందీలను బేషరతుగా విడుదల చేయాలి. గాజా పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. సాధారణ స్థితి స్థాపనకు జరిగే ప్రయత్నాల్ని స్వాగతిస్తాం' అని పేర్కొన్నారు.