జపాన్‌లోని సముద్రంలో అగ్ని పర్వతం విస్ఫోటం చెంది ఒక కొత్త ద్వీపం ఏర్పడింది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఐవో జిమా దక్షిణ కోస్తా తీరానికి కిలో మీటర్ దూరంలో అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగింది. అనంతరం పది రోజుల్లోనే బూడిద, రాళ్లు పేరుకొని 100 మీటర్ల వ్యాసంతో సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.