రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన కొండపల్లి వెంకటరాముడు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వం సీ ఎం ఆర్ఎఫ్ కింద 4, 80, 000 రూపాయలు మంజూరు చేసింది. శుక్రవారం బాధితుడు భార్య కొండపల్లి అలివేలమ్మకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.