పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే శంకర్ నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి జర్నలిస్ట్ లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్ట్ లకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పెనుకొండ జర్నలిస్ట్ లు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.