పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నుండి పట్టణ పుర విధుల్లో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హై కోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసనగా ర్యాలీ ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వేసి నివాళులర్పించి దర్గా సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం ఏఓ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు.