అనంతపురం జిల్లాలో పదవ తరగతి పరీక్ష ఫీజును ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, కుల్లాయస్వామి మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్ష ఫీజులో కూడా విద్యార్థుల నుండి దోపిడీ చేయడం బాధాకరమన్నారు.