ఢిల్లీ లిక్కర్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు నేతలు జైలులో ఉన్నారు. మరోవైపు.. త్వరలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడమే కాకుండా భారీ కుట్రకు బీజేపీ తెరలేపుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. అక్టోబర్ 4 వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అరెస్ట్ చేసి జైలులో ఉంచింది. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పరచగా.. జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 24 వ తేదీ వరకు పొడగించింది. ఈ క్రమంలోనే ఆయన ఎంపీగా పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సంజయ్ సింగ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడమే కాకుండా.. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ప్లన్ చేస్తున్నట్లు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఆప్ ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్‌ని ఢిల్లీ లిక్కర్ కేసులో అక్టోబర్ 4న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన మూడో వ్యక్తి సంజయ్ సింగ్. అంతకుముందు ఢిల్లీ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్, ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వారు మాజీలుగా ఉన్నారు. మరోవైపు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు నవంబర్ 24 వరకు పొడగించింది. పార్లమెంట్ సభ్యుడిగా అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు న్యాయమూర్తి అనుమతించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రగా కేజ్రీవాల్ అభివర్ణించారు. 2024 ఎన్నిలకు ముందు ప్రతిపక్షాలకు చెందిన నేతలను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే.. ఆయన రాజీనామా చేయాలా లేక ప్రభుత్వాన్ని కొనసాగించాలా అనే దానిపై ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో రిఫరెండం నిర్వహిస్తామని ఆప్ నేతలు చెబుతున్నారు.