శుక్రవారం ఉదయం ఆ 660 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మండల వైయస్ఆర్సీపీ అధ్యక్షుల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాలుగున్నరేళ్లలో సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాల ద్వారా చేసిన మంచిని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడాన్ని వివరిస్తూ 24 పేజీలతో రూపొందించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికీ అందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు–పవన్‌లు ఇచ్చిన హామీలను.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల అమలు తీరుతో పోల్చుతూ నేతలు ప్రజలకి వివరించారు.