చక్రాయపేట మండలం కే. ఎర్రగుడి గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. చక్రాయపేట మండల వైస్సార్సీపీ ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి ఆధ్వర్యంలో గ్రామవాలంటీర్లు, గృహా సారథులు, సచివాలయ కన్వీనర్లు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సీఎంగా మళ్ళీ జగన్ అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని వైస్సార్సీపీ నాయకులు తెలియజేశారు.