అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ నెల 15న కాలిఫోర్నియాలో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్ అంశాలతో పాటు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలు అగ్రనేతల మధ్య చర్చకు రానున్నాయని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సుకు బైడెన్ ఆహ్వానం మేరకు జిన్పింగ్ హాజరవుతున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.