భారత దేశ మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి వర్యులు మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి వేడుకలు అమలాపురంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు, ప్రముఖులు, ముస్లిం సోదరులు పాల్గొని అజాద్ విగ్రహాన్నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్య సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపించారని కొనియాడారు.