సామాజిక సాధికార బస్సు యాత్ర పెదకూరపాడులో ప్రభంజనం సృష్టించింది. జనంతో అమరావతి పొలికేక పెట్టింది. జగనన్న సారథ్యంలో అట్టగుడుగువర్గాల అభ్యున్నతిని సాకారం చేసి జనం వద్దకు వచ్చిన జగనన్న సైన్యానికి అడుగడుగునా జేజేలు లభించాయి. సామాజిక సాధికార బస్సు యాత్ర పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని, ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, నంబూరు శంకరరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ తదిరులు పాల్గొన్నారు.