హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాయాల పాలైనవారికి, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. భవనాల్లో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్లే ఈ ఘోరం చోటు చేసుకొందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు. నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చేవాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa