బీహార్‌లోని కైమూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈత కొట్టి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు బాలురు, ఒకరు బాలిక ఉన్నారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa