సోమవారం వైసీపీ నాయకులు రాజాంలో జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలన చేసారు. ఈనెల 16వ తారీఖున రాజాం నియోజకవర్గం పరిధిలో రాజాం మండలం లో సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్ ను పరిశీలించారు. రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.