వైసీపీలోని మాదిగ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనం చూసుకుంటున్నారే తప్ప మాదిగలకు చేసిందేమి లేదని మాజీ మంత్రి కేఎస్ జవహర్ వాపోయారు. మాదిగ కార్పోరేషన్‌కు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.... లిడ్ క్యాప్ అడ్రస్ లేకుండా చేశారన్నారు. భూమి కొనుగోలు పథకం అటకెక్కించారని.. ముందడుగు పధకం ఊసే లేదన్నారు. సంక్షేమ శాఖ జగన్ నిర్లక్ష్యానికి బలైందన్నారు. చంద్రబాబు ఇచ్చిన డప్పు, చెప్పు, చర్మకార ఫించన్లు తప్ప అదనంగా ఏ ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మాదిగలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. మాదిగలకు చంద్రబాబు పాలనలోనే మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. మలుపు పధకం మరిచిపోయారని.. మాదిగలెప్పుడు ఇంత దయనీయ పరిస్థితి చూడలేదన్నారు. మాదిగలకు జగన్ ఏమి చేస్తూన్నాడో చెప్పి సదస్సులు పెట్టాలని జవహర్ డిమాండ్ చేశారు.