వైసీపీ నేతలు ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా తయారయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాపోయారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జీవీ ప్రవీణ్ కుమార్‌రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి, అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నా. కక్షసాధింపులో భాగంగానే ప్రవీణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదే ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బీసీ నేత నందం సుబ్బయ్యని అత్యంత దారుణంగా చంపిస్తే నో కేస్. సుబ్బయ్యను చంపించింది ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి అని పోలీసులకు తెలిసినా నో యాక్షన్. కొలిమిగుండ్లలో తెలుగు యువత ప్రతినిధి మంద విజయ్‌గోపాల్‌పై దాడి చేసిన వైసీపీ సైకోలని అవే చెప్పులతో ప్రజలు తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని లోకేశ్ హెచ్చరించారు.