వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు బలైపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... నాలుగున్నరేళ్లలో సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు ఇసుక సంపదను దోచేశారు. జేపీ వెంచర్స్ అనే బినామీ కంపెనీని అడ్డం పెట్టుకుని, అడ్డగోలుగా దోపిడీ చేశారు. రూ.50 వేల కోట్ల ఇసుక దోపిడీని చంద్రబాబు విడమరిచి చెప్పి, ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. అందుకే తొమ్మిదేళ్ల నాటి ఉచిత ఇసుక పాలసీపై కేసులు పెట్టారు. స్కిల్ స్కామ్ అంటూ కేసు పెట్టి, అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసి, ఆధారాలు చూపలేకపోయారు. జగన్‌రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఆనంద్‌బాబు హెచ్చరించారు.