కడపలో ఆదివారం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...... కడప నగరం నిరంజన్నగర్కు చెందిన చిట్వేలి భవానీశంకర్ (30), అతడి భార్య బాబాబీ నిరంజన్‌నగర్ 13, 14 వార్డుల వలంటీర్లుగా పనిచేస్తున్నారు. కడపకు చెందిన గుజ్జుల మల్లికార్జున జీవిత బీమా కార్యాలయంలోని ఈడీఎంఎ్సలో డేటా డిజిటలైజేషన్ టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఇదే టీమ్‌లో మల్లికార్జున భార్య శైలజతోపాటు, ఔట్సోర్సింగ్ పద్ధతిన వలంటీర్ భవానీ శంకర్ కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శైలజ, భవానీశంకర్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మల్లికార్జున శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. భవానీశంకర్‌ను హత్య చేసి పగ తీర్చుకోవాలని పథకం రచించాడు. రంజిత్‌కుమార్ అనే ఆటోడ్రైవర్‌తో కలసి ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీశంకర్‌కు ఫోన్ చేసి ఎల్ఐసీ కార్యాలయంలోని వీరి ఆఫీసుకు పిలిపించుకున్నారు. భవానీ శంకర్ వచ్చీరాగానే అతడి మెడపై కత్తితో నరికి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిన భవానీ శంకర్ అక్కడికక్కడే కన్నుమూశాడు. కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.