కర్నూలు, రాఘవేంద్రనగర్‌లో ఓ అపార్టుమెంటులో మూడో ఫ్లోర్‌లోని ప్లాటులో జెహిమా ఖాతూన్ (21) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షారుక్ అన్సారీ, జహీమా ఖాతూన్‌లు భార్యభర్తలు. వీరు కర్నూలులో వచ్చి ఇటీవలే స్థిరపడ్డారు. స్థానికంగా కుర్చీలు తయారు చేస్తుంటారు. సోమవారం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జహీమా ఖాతూన్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తర లించారు.