జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. దళితుల ఓట్లు దండుకుని సీఎం అయ్యాక దళితులను మోసం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. జగన్ పాలనలో దళితులపై 6 వేల దాడులు జరిగాయని.. ఈ దాడుల్లో 28మంది చనిపోయారని తెలిపారు. దళితులను చంపిన ఏ ఒక్కరికీ శిక్ష వేయకుండా నిందితులను ప్రక్కన కూర్చోబెట్టుకున్న దళిత ద్రోహి జగన్ అని విరుచుకుపడ్డారు. వైసీపీ సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో చేయడం లేదన్నారు. దళితవాడల్లో బస్సుయాత్ర చేస్తే వైసీపీ మంత్రులను దళితులు తరిమి తరిమి కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa