ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాళ్ళు దెబ్బతిన్న ప్రొద్దుటూరు యానాదికాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త కుళ్లాయప్పను టీడీపీ నాయకుడు సీఎం సురేష్ నాయుడు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. కుళ్లాయప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి, నల్లబోతుల నాగరాజు, తదితరులు వున్నారు.