వైఎస్ జగన్ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికా రం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్స యాత్ర రెండో దశ బుధవారం ప్రారంభమవుతోంది. ఈ నెల 30 వరకు ఈ యాత్ర జరుగుతుంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది.