ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వరికపుడిశెల ఎత్తిపోతల పథకంకి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 11:09 AM

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు.పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవే­రుస్తూ.. ‘వైయ‌స్ఆర్‌ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్ట­నున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం వైయ‌స్ జగన్‌ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com