వైయస్ఆర్ సీపీ ప్రతిష్టాత్మక "సామాజిక సాధికార యాత్ర" రెండో దశ ప్రారంభం కాబోతుంది.. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు సాగే ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొననున్నారు. తొలిదశలో 35 నియోజకవర్గాలలో జరిగిన సామాజిక సాధికారయాత్ర రెండోదశలో 39 నియోజకవర్గాలలో జరగబోతోంది. రెండో దశలో తొలి రోజున (15-11-2023)....శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట , గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది. పేద, బడుగు వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించే సామాజిక సాధికార యాత్ర రెండో దశ 39 నియోజకవర్గాల్లో జైత్రయాత్ర చేయనుంది.