ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. డెహ్రూడూన్‌కు 140 కిలో మీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 5 కిలో మీటర్ల లోతులో భూ కదలికలు సంభవించాయని పేర్కొంది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.