ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాలో మానవతా సహాయం కోసం యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 12 దేశాలు మద్దతు తెలిపారు. అయితే అమెరికాకా, రష్యా, బ్రిటన్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజా స్ట్రిప్‌లో మానవతా సహాయం కోసం అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని తీర్మానించింది.