రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ (75) మృతి చెందారు. కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున గుర్మీత్ సింగ్ కూనర్ పోటీ చేస్తున్నారు. కిడ్నీ, హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా, గంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ నుంచి గుర్మీత్ సింగ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.