వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న సంకల్పంతో టీడీపీ - జనసేనలు పటిష్ఠ కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ పలు అంశాలకు ఆమోదం తెలపగా, రేపటి నుంచి పథకాలపై ఇంటింటి ప్రచారం చేయనున్నాయి. అయితే పూర్తిస్థాయి మేనిఫెస్టోను త్వరలోనే ఖరారు చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.