రెంటచింతలలోని ఎస్బిఐ ఏటీఎం వద్ద బుధవారం రాత్రి ఓ ఆగంతకుడు నేరానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ప్రవళిక ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సహాయం చేసే ప్రయత్నంలో ఏటీఎం పిన్ నెంబర్ గమనించాడు. అనంతరం ఆ కార్డును అతను తీసుకుని తన వద్దనున్న మరో కార్డును ప్రవళికకు ఇచ్చాడు. గంట వ్యవధిలో రూ. 46 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.