తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి వ్యాఖ్యానించారు. భూమన కరుణాకరరెడ్డి చైర్మన్ అయ్యాక.. దేవస్థానం డబ్బుల్ని తన కుమారుడు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు ఆనం మాట్లాడుతూ.. తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10 శాతం లంచం తీసుకుంటున్న కరుణాకరరెడ్డిని ఇప్పటికే 10 శాతం కరుణాకరరెడ్డిగా పిలుస్తున్నారని అన్నారు.