ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరి నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో పొగలు వచ్చాయి. పుదుచ్చేరి నుండి హౌరా వెళ్తున్న హౌరా రైలు జామి విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి గోస్తిని వంతెనపై బ్రిడ్జి వద్దకు రాగానే ఏసీ భోగి నుండి పొగలు వచ్చాయి.
దీంతో సమీపంలో పశువుల కాపరి గమనించి పొగలు వస్తున్నాయని కేకలు పెట్టాడు. రైలు కిటికీ పక్కనే నిలబడ్డ ప్రయాణికుడు గమనించి చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. లోకో పైలట్, గార్డ్ పుగలు వచ్చిన భోగి వద్దకు వచ్చి పరిశీలించి, సాంకేతిక లోపాన్ని సరిదిద్దారు. ఏసీ కోచ్ కింద పొగలు రాగడం సహజమేనని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.