స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. బుధవారమే ఆయన వాదనలు ప్రారంభించారు. అయితే పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.