పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తండ్రి గారైనటువంటి కాసు కృష్ణారెడ్డి గారు, అయన కార్యకర్త మాతంగి శాంతయ్య నూతనంగా ప్రారంభించిన ఫ్యాన్సీ మరియు టిఫిన్ షాప్ ని నేడు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి అనధికాలంగా సేవలందించిన మానుకొండ శ్రీనివాసరావు ఆరోగ్య విషయమై కేసనపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అథితిగా వైసీపీ నాయకులు మారూరి శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... కేసనపల్లి గ్రామంలో మా పట్ల అభిమానాన్ని చాటుకుంటున్న కాసు అభిమానులకి, కార్యకర్తలకి ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తాం అని తెలియజేసారు. అలానే, మారూరి శివారెడ్డి మాట్లాడుతూ...గ్రామంలో ప్రతి కార్యకర్త ఎదుగుదలకి నా వంతు బాధ్యతగా అండగా నిలుస్తానని, ఆపదలో ఉన్న ప్రజానీకానికి తోడుగా నిలుస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు, కార్యకర్తలు పాల్గొన్నారు.