చంద్రబాబు మెడికల్ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు.. కోర్టు అనుమతిస్తే బెయిల్ వస్తుంది. ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.