పల్నాడు జిల్లాలో గతేడాది ఒక మహిళపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. గురువారం సాయంత్రం పల్నాడు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, గతేడాది ఏప్రిల్ నెల 22న గురజాల రైల్వే స్టేషన్లో ఉన్న మహిళను నమ్మించి భోజనం పెట్టిస్తామని నిందితులు తీసుకెళ్లారు. ఆపై మహిళపై సామూహిక అత్యాచారం చేయగా విచారణ అనంతరం ఇద్దరికి న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 20, 000 జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు.