పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ వీర గొట్టం. భామిని, సీతంపేట మండలాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి గ్రామాల్లో నాగుల చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా దీపావళి అనంతరం ఈ పండుగను కుటుంబ సభ్యులతో నిర్వహిస్తామని పలువురు భక్తులు తెలిపారు. పుట్ట వద్దకు వెళ్లి నాగదేవతకు పాలు, గుడ్లు, నారికేళ ఫలాలు, దీప దూప నైవేద్యాలతో ఈ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa