ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 02:33 PM

ఆంక్షలు, వివాదాల్లో ఇరుక్కు­పోయిన భూముల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి ఆ దిశగా మరో కీలక ముందడుగు వేస్తున్నారు. భూ­ము­­లకు సంబంధించి కొద్ది నెలలుగా ప్రభుత్వం తీసు­కున్న కీలక నిర్ణయాలను అమల్లోకి తెస్తూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహి­స్తున్న బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన­ను­న్నారు. దళితులు, పేదల జీవితాలు పూర్తిగా మారి­పోయే అత్యంత కీలకమైన 12 అంశాలు ఇందులో ఉన్నాయి. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాల­తోపాటు చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, దళిత వాడలకు శ్మశాన వాటి­కలు కేటాయిస్తూ పత్రాలు ఇవ్వడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa