వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా.. దళితులకు అన్యాయం జరగదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ... కొవ్వూరులో జరిగిన సంఘటన నిజంగా బాధేసింది. నాకన్నా ముఖ్యమంత్రి గారికి చాలా బాధేసింది. ఒక దళిత యువకుడు కొవ్వూరులో ఆత్మహత్య చేసుకుని చనిపోతే వెంటనే స్పందించి నన్ను, శాసనసభ్యుడిని పంపి ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పారు. వారికి అండగా కొంత సాయం చేశాం. దాన్ని కూడా కొంతమంది చెల్లని చిత్తుకాగితం లాంటి వారు విమర్శిస్తున్నారు. సంఘటనను రాజకీయాలకు వాడుకుంటూ సభ్యత మరచి మాట్లాడుతున్నారు. మేము బూతులు మీకంటే నాలుగింతలు బూతులు మాట్లాడగలం. మాకు సభ్యత సంస్కారం ఉంది. రాజశేఖరరెడ్డి గారి శిష్యరికంలో పైకి వచ్చినవాళ్లం. ఎవడెవడో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు. దళిత యువకుడు చనిపోతే, ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచింది. దానికి కూడా జగన్ దళితులను పట్టించుకోవడం లేదంటూ కారుకూతలు కూస్తున్నారు. కోట్ల రూపాయలతో మా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 12 శాతం ఉన్న పేదరికాన్ని జగన్ గారు 6 శాతానికి తగ్గిస్తే..ఓర్వలేక మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.