స్కామ్‌లకు, అవినీతికి టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని వైయస్ఆర్సీపీ మహిళా నాయకురాలు బండి పుణ్యశీల మండిపడ్డారు. విజయవాడ నగరంలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో బండి పుణ్యశీల మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి సామాన్య ప్రజలను టిడిపి నాయకులు మోసం చేసారన్నారు. టిడ్కో ఇల్లు ఇప్పిస్తానని నాలుగు కోట్ల రూపాయలు స్కామ్ చేసిన మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు సహా పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తీరును చూస్తే స్కామ్ లకు అవినీతికి కేరాఫ్ అడ్రెస్స్ టిడిపి అన్ని తెలుస్తుందన్నారు . ఈ స్కామ్ లు బాధితులైన ప్రజలకు వైయస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.